
పాడేరు, ఫిబ్రవరి 28: బాల కార్మిక నిర్మూలన, పునరావాసఒoలో భాగంగా పాడేరులో పలు దుకాణలు, సంస్థలపై శుక్రవారం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ తనిఖీలు జరిపింది. తనిఖీలలో భాగంగా జిల్లా కార్మిక శాఖ ఇంచార్జి ఆఫీసర్ టి సుజాత, సహాయ కార్మిక శాఖ అధికారి పి. సూర్య నారాయణ, ICDs, సోషల్ వెల్ఫేర్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ఆయా యాజమాన్యం వారికి, పిల్లలకు అవగాహన కల్పించారు. అదేవిదంగా బాలకార్మికులను పనిలో పెట్టుకొంటే కఠిన చర్యలు తప్పవని హేచ్చరించారు.