తణుకు: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను వదిలి దేశ రక్షణలో తణుకుకి చెందిన దంపతులు భారత సైన్యంలో మేజర్లుగా సేవలు అందిస్తున్నారు. పట్టణానికి చెందిన బొల్లిన భావన 2017 వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేశారు. 2018లో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా విధులలో చేరిన ఆమె ప్రస్తుతం ఆర్మీలో మేజర్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ఆదిత్య సైతం సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి ఆర్మీలో చేరారు. ప్రస్తుతం కశ్మీర్లో మేజర్‌గా పనిచేస్తున్నారు