'హరి హర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్..
News Image

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న మూవీల్లో హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు ఒక‌టి. పీరియాడిక‌ల్ యాక్షన్‌ అడ్వెంచర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ పూరైన‌ట్లు చిత్ర బృందం చెప్పింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నిథి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే ప‌లుమార్లు ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ చిత్ర బృందం ప్ర‌క‌టించింది. జూన్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలిపింది.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, రెండు పాట‌లు సినిమా పై అంచ‌నాల‌ను భారీగా పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.