
హైదరాబాద్,న్యూస్ వన్ ప్రతినిధి :
SLBC టన్నెల్ వద్ద 17వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న(ఆదివారం) ఒక మృతదేహాన్ని వెలికితీయగా.. తాజాగా మరో రెండు మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. ఈరోజు ఆ మృతదేహాలను వెలికితీయనున్నారు. కేరళ పోలీస్ విభాగానికి చెందిన కడావర్ డాగ్స్.. మట్టిలో 15 అడుగుల కింద ఉన్న మృతదేహాల ఆనవాళ్లను కూడా పసిగట్టగలవు.