
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కోరిన ఏపీ జేఏసీ అమరావతి.
అమరావతి (ఫిబ్రవరి 12)న్యూస్ వన్ ప్రతినిధి :
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైయున్న సంస్థ (ఆప్కాస్)ను ప్రభుత్వం రద్దు చేసి, గతంలో మాధిరిగా ప్రెవేటు ఏజెన్సీల కు మరళా పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో అనిచ్చితి, ఆందోళన నెలకొందని, ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇస్తూ ఔట్ సోర్శింగు ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం ప్రకటన చేయాలని బుదవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే. విజయానంద్ ని కలసి విజ్ఞప్తి చేస్తూ లేఖ ఇచ్చినట్లు
ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పల్లిశెట్టి దామోదరరావు, ఏపి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుమన్, అల్లం సురేష్ బాబు లు తెలిపారు.ప్రస్తుతం ఉన్న ఆప్కాస్ సంస్థ రద్దు పరచవలసి వస్తే నూతన విధానంలో ఆంధ్రప్రధేశ్ లో పనిచేస్తున్న సుమారు రెండున్నర లక్షల మంది ఔట్ సోర్శింగు ఉద్యోగులందరికి అప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, గతంలో ఏజెన్సీ లు చేసిన అనేక తప్పులకు ఉద్యోగులు బలి అయ్యారని, ఆయా ఏజెన్సీ లపై ప్రభుత్వం అనేక కేసులు కూడా నమోదు అయ్యాయని, కనుక గతంలో ఏజెన్సీల ద్వారా జరిగిన అవకతవకలు దృష్టిలో ఉంచుకుని. ఏజెన్సీ ల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించొద్దని..తద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు, జీతాలు కాపాడాలని…గత దశాబ్దాలుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కొనసాగించాలని, అలాగే సంబంధిత డిపార్ట్మెంట్ల ద్వారా నేరుగా ఆయా శాఖల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు జీతాలు చెల్లించాలని.ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసి, మెప్మా, సేర్ప్ సొసైటీలలలోని ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ పాలసీనీ అన్ని ప్రభుత్వ శాఖల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు అమలు చేస్తూ, ఉద్యోగ భద్రత, భరోసా కల్పించాలని కోరారు. అలాగే, గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అనేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను అలాగే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఔట్ సోర్శింగు ఉద్యోగులందరిని ఆయా శాఖలకు అప్పచెప్పే విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాత విధానాన్ని (ప్రైవేటు ఏజెన్సీలు) ప్రోత్సహించకుండా చూడాలని కోరారు. ఈ ప్రేవేటు ఎజెన్సిలతో గతంలో ఔట్ సోర్శింగు ఉద్యోగులు అనేక విధాలుగా నష్టపోయారని, ప్రధానంగా కనీసం జీతాలు కూడా సకాలంలో, సక్రమంగా చెల్లించక పోవడమే కాకుండా ఉద్యోగులు ఈపీఎఫ్ /ఈఎస్ఐ క్రింద చెల్లించాల్సిన డబ్బులు కూడా ఏజెన్సీలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయని ఉదాహరణతో కూడా తెలిపారు. ఉద్యోగుల జీతాలు ప్రవేట్ ఏజెన్సీలు తినేసిన సంఘటనలో ప్రభుత్వాలు రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టు చట్టం అమలు చేసి రికవరీ చేయాలని ఆదేశించిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పన లో భాగంగా మెప్మా/ స్పెర్స్ ఉద్యోగులకు మాదిరిగా హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ, ఉద్యోగ భద్రత భరోసా కల్పించాలని కోరారు. ఆ రెండు సొసైటీలలో (మెప్మా, స్పెర్స్) పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తుండగా, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయకపోవడం చాలా బాధాకరంగా అన్నారు.వార్త పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి, రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులలో ఆందోళన మొదలైనందున, కూటమి ప్రభుత్వం అధికారం లోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందని ఎదురుచూస్తున్న ఔట్ సోర్శీంగు ఉద్యోగులలో ఆత్మస్దయిర్యం దెబ్బతినేలా చూడకుండా, అందరీలో దైర్యం నింపేలా ప్రభుత్వం ప్రకటన చేయాలని బొప్పరాజు/పలిశెట్టి, కే.సుమన్, అల్లం సురేష్ బాబు, గంటా సంపత్ కుమార్, చింతలపూడి రమణ మూర్తి తెలిపారు