
300 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న కార్యక్రమంలో ఉత్తమ విధానాలు, సుపరిపాలనపై మేధోమథనం
రాష్ట్ర ప్రభుత్వ నూతన పాలసీలు, 2047 విజన్ లక్ష్యాలను కాంక్లేవ్‌లో వివరించిన ఏపీ నుంచి హాజరైన కుమార్ రాజా
పుణె :
పుణెలో ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన లీడర్ షిప్ కాంక్లేవ్‌లో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ కాంక్లేవ్‌కు దేశం మొత్తం మీద 300 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా ఏపీ నుంచి కుమార్ రాజా హాజరయ్యారు. సుపరిపాలన, పబ్లిక్ పాలసీల రూపకల్పనపై ఆలోచనలు, ఉత్తమ అభ్యాసాలపై చర్చించేందుకు కాంక్లేవ్ నిర్వహించారు. ఈ కాంక్లేవ్‌లో స్వర్ణాంధ్ర విజన్, పేదరిక నిర్మూలనకు రూపొందించిన పీ4 విధానాలపై ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ మేరకు కాంక్లేవ్ వివరాలను ఎమ్మెల్యే కుమార్ రాజా సోమవారం సీఎంకు చంద్రబాబుకు వివరించారు. కుమార్ రాజాను సీఎం అభినందించారు.