
(విజయవాడ సిటీ,న్యూస్ వన్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ లో రాయదుర్గంలో వైసీపీ నేతతో పాటుగా వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారట. దీంతో వంశీ ఫోను పోలీసులు దృష్టి వెళ్లగా దీనిని స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. వంశీని హైదరాబాదులో అరెస్టు చేయగా ఆయన సెల్ఫోన్ అక్కడ దొరకలేదని వ్యక్తిగత సహాయకుడు ఫోన్ ని గురువారం రోజున తీసుకొని మరి సీజ్ చేశారట అధికారులు.వంశీని అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లినప్పుడు దుస్తులు మార్చుకొని వస్తానని చెప్పి ఆయన సుమారుగా ఒక గంట పాటు మొబైల్ లోని మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారట.. అయితే అక్కడ ఏం మాట్లాడారనే విషయంపై ఇప్పుడు పోలీసులు ఆరాతిస్తున్నారు. పోలీసులు తన ఇంటిని అంతా రెండు గంటల పాటు జల్లెడ పట్టిన మొబైల్ దొరకలేదట.అయితే వంశీని అరెస్టు చేసిన తర్వాత చివరిసారిగా మాట్లాడిన లొకేషన్ రాయదుర్గంలోని ఆయన నివాసంలో చూపిస్తోందట. అక్కడ కూడా మొబైల్ దొరకకపోవడంతో పోలీసులు అక్కడి నుంచి తిరిగి వచ్చారని అనంతరం హైదరాబాదుకు వచ్చి ఆయనను అరెస్టు చేయగా ఆ తర్వాత అక్కడ కూడా మొబైల్ దొరకపోవడంతో విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకమైన కోర్టులో పిటిషన్ వేసి వంశి మొబైల్ తమ చేతికి రావాలి అంటూ డిమాండ్ చేశారట అధికారులు. అయితే సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో 12 మంది ఉన్నట్లుగా పోలీసులు గుర్తించామని తెలుపుతున్నారు. మరి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి.