
సత్యసాయి జిల్లాకు తగినంత ప్రభుత్వ సిబ్బందిని కేటాయించండి .
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి,న్యూస్ వన్ ప్రతినిధి :10
సత్యసాయి జిల్లాకు శాశ్వతమైన ప్రభుత్వ భవనాలను కేటాయించాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సభ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. శాసన సభ లో సోమవారం ప్రశోత్తరాల సందర్భంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలు శాశ్వతంగా నిర్మించాలని ,వాటికి స్థల సేకరణ చేసి ప్రభుత్వం ద్వారా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 4న 2022 నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది.అయితే ప్రభుత్వ భవనాలు కానీ నిధులు కానీ ఎక్కడ నయా పైసా మంజూరు చేయలేదు. నూతన జిల్లాకు కనీసం తగినంత సిబ్బందిని కూడా కేటాయించలేదు. నూతన జిల్లాలకు స్థలాలను సేకరించి శాశ్వతమైన ప్రభుత్వ భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సభ ద్వారా సంబంధిత మంత్రిని ప్రత్యేకంగా కోరారు.సత్యసాయి జిల్లాలో కొత్తగా ఏర్పాటు అయిన కలెక్టరేట్ ఇతర భవనాలు సత్తసాయి ట్రస్ట్ భవనాలలో కొనసాగుతున్నాయని ప్రత్యేకంగా గుర్తు చేశారు ప్రభుత్వం త్వరగా జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ తోపాటు సుమారు 52 డిపార్ట్మెంట్లో కార్యాలయాలను నిర్మించి వాటికి తగినంత సిబ్బందిని ఆ కార్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరారు. నూతన జిల్లాలకు ప్రభుత్వ భవనాలు స్థల సేకరణ సిబ్బంది కొరతపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని తప్పకుండా వాటికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సంబంధిత మంత్రి హామీ ఇచ్చారు.