news Breaking News
clock
'వార్ 2' లో ఎన్టీఆర్ - హృతిక్ మధ్య యుద్ధం

'వార్ 2' లో ఎన్టీఆర్ - హృతిక్ మధ్య యుద్ధం

Print News

 RRRతో నేషనల్ వైడ్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. అప్పట్నుంచి అన్ని భారీ సినిమాలే చేస్తున్నాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు అని ప్రకటించిన దగ్గర్నుంచి ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. బాలీవుడ్ లో YRF స్పై యూనివర్స్ సినిమాల్లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ స్పై సినిమాలు అంటే యాక్షన్స్ భారీగా ఉంటాయని తెలిసిందే. అందులో యష్ రాజ్ ఫిలిమ్స్ లో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఆశిస్తారు ప్రేక్షకులు.నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో స్వయంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెష్ చెప్తూ వార్ 2 టీజర్ రిలీజ్ చేసారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజయిన వార్ 2 టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. టీజర్ ఎన్టీఆర్ వాయిస్ తోనే మొదలైంది.. నా కళ్ళు నిన్ను ఎప్పట్నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్.. ఇండియా బెస్ట్ సోల్జర్, రా లో బెస్ట్ ఏజెంట్ నువ్వే కానీ ఇప్పుడు కాదు, నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు యుద్దానికి సిద్ధంగా ఉండు అని ఎన్టీఆర్ హృతిక్ కి వార్నింగ్ ఇచ్చినట్టు పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పారు.దీంతో ఈ సినిమాలో హృతిక్ పాజిటివ్ క్యారెక్టర్ అని, ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఇక టీజర్ లోనే భారీ యాక్షన్ సీన్స్ చూపించారు. ఎన్టీఆర్ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ మీదకు దూకడం, బోట్ లో వెళ్తూ ఫైరింగ్, జెట్ ఫైటర్స్ నుంచి ఎన్టీఆర్, హృతిక్ దూకడం, మంచు కొండల్లో కూడా ఎన్టీఆర్ – హృతిక్ ఇద్దరు కొట్టుకోవడం.. ఇలా భారీ యాక్షన్స్ చూపించారు. టీజర్ లో యాక్షన్స్ చూస్తుంటేనే నేల మీద, గాలిలో, నీళ్ల మీద.. అన్ని చోట్ల ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ డిజైన్ చేసినట్టు ఉంది. ఈ యాక్షన్ సీన్స్ కి ప్రేక్షకులు ఆశ్చర్యపోక తప్పదు. దీంతో ఎన్టీఆర్ – హృతిక్ మధయ్ ఈ సినిమాలో చాలా ఫైట్స్ ఉంటాయి, ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందని తెలుస్తుంది.


ఇక ఎన్టీఆర్ కూడా కొత్త లుక్ లో, కాస్త బాడీ పెంచి పవర్ ఫుల్ గా కనిపించాడు. ఎన్టీఆర్ కి ఎలివేషన్స్ గ్రాండ్ గా ఇచ్చారు. టీజర్ లోనే ఇలా ఉంటే సినిమాలో ఇంకెంత పర్ఫార్మెన్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక హృతిక్ బాడీ చూసి ఆశ్చర్యపోవడం ఖాయం. ఇండియన్ సూపర్ స్టార్స్, బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరైన హృతిక్ ఈ సినిమా కోసం మరింత కష్టపడినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ లోనే కియారా బికినీ షాట్ చూపెట్టి సినిమాలో అందాల ఆరబోత బాగానే ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ఇక్కడ ఎన్టీఆర్ చేసిన మాస్ ఫైట్స్ చూస్తేనే హడావిడి చేసే ఫ్యాన్స్ ఇక వార్ 2 లో ఎన్టీఆర్ చేసే హాలీవుడ్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్ లు చూసి ఏమైపోతారో. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ – హృతిక్ కలిసి డ్యాన్స్ చేసే సాంగ్ కూడా ఒకటి ఉందని డైరెక్టర్ గతంలో తెలిపాడు. ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు కలిసి డ్యాన్స్ వేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి. టీజర్ తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇక ఈ సినిమా గతంలో YRF తీసిన పఠాన్, టైగర్, వార్.. లాంటి పలు సినిమాల కంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు టాక్. కలెక్షన్స్ కూడా 1000 కోట్లు ఈజీగా దాటేస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్, హృతిక్ లాంటి స్టార్స్ ఉండటం, పాన్ ఇండియా రిలీజ్, దేశభక్తి సెంటిమెంట్, ఇండిపెండెన్స్ డే సమయంలో రిలీజ్ కాబట్టి కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా డైరెక్ట్ సినిమాలు చేస్తాడని అంటున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ సోలో హీరోగా ఇదే YRF స్పై సినిమాల్లో ఒక సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ స్టార్ అయిపోతాడా? అక్కడే ఎక్కువ సినిమాలు చేసి పాన్ ఇండియా రిలీజ్ చేస్తాడా? ఎన్టీఆర్ కి హిందీ కూడా బాగా వచ్చు కాబట్టి అక్కడ స్టార్స్ తో బాగా కలిసిపోయి అక్కడే సెటిల్ అవుతాడా అని కూడా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.మొత్తానికి ఒక్క వార్ 2 టీజర్ తోనే ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ అంతా చర్చించుకునేలా, ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి ఎదురుచూసేలా చేసారు.

Leave a Reply

Cancel Reply

Your email address will not be published.

Related News

Follow US

VOTE FOR CHAMPION

vote-image

Who is the world cup winner of 2023

35%
11%
31%
17%
2%
4%
0%

Top Categories

Recent Comment

Please Accept Cookies for Better Performance